పాకిస్థాన్లోని దక్షిణ సింధ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. తట్టాలోని కీన్ఝార్ సరస్సులో ఓ పడవ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారు ఉన్నారు.
విహార యాత్ర కోసం కీన్ఝార్ సరస్సు సమీపంలోని రిసార్టుకు వచ్చింది ఆ కుటుంబం. అక్కడే ఓ పడవ అద్దెకు తీసుకుని సరస్సులో ప్రయాణిస్తుండగా బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.