తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫోన్ వాడితే పని చేయలేం.. నిద్ర పట్టదు - టెక్నాలజీ

ఫోన్​ అతిగా వాడితే నిద్రలేమితో పాటు పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.

మొబైల్

By

Published : Mar 28, 2019, 6:01 AM IST

"చరవాణి(ఫోన్)​ అతిగా వాడడం ఆరోగ్యానికి హానికరం... ప్రాణాంతకం" భవిష్యత్తులో ఈ వాక్యాన్ని చాలా చోట్ల చూడాల్సి వస్తుందేమో! ఎందుకంటే చరవాణుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణంగా నిద్రలేమితో పాటు పని ఒత్తిడి పెరిగి ఉత్పాదకత సామర్థ్యం తగ్గిపోతోందని ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. నిపుణులు దీన్ని టెక్నోఫెరెన్స్ (ఆరోగ్యంపై సాంకేతికత ప్రభావం) గా పిలుస్తున్నారు. 13 ఏళ్లుగా టెక్నోఫెరెన్స్ ప్రభావం అధికమవుతోందని తెలిపారు.

ఆస్ట్రేలియా క్వీన్స్​లాండ్​ వర్సిటీకి చెందిన పరిశోధకులు 18 నుంచి 83 ఏళ్ల మధ్య వయసున్న 709 మంది ఫోన్​ వినియోగిస్తున్న వారిపై గతేడాది సర్వే నిర్వహించారు. మొదటగా వీరిపైనే 2005లోనూ పరిశోధన చేశారు. ఈ 13 ఏళ్ల కాలంలో ఫోన్లు, ల్యాప్​టాప్​లు వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని.. దీనివల్ల నిద్రలేమితో పాటు చురకుగా పనిచేయలేకపోతున్నారని పరిశోధకులు తేల్చారు.

మొబైల్స్

ఎక్కువ సమయం ఫోన్​తో గడపడం వల్ల ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు(19.5 శాతం), ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ఒకరు (11.8 శాతం) నిద్రలేమికి గురవుతున్నారు. 2005 లెక్కలతో పోలిస్తే గతేడాదికి 12.6 శాతం మంది పురుషులు తాము సరిగ్గా పనిచేయలేకపోతున్నామని చెప్పారు. తమ పని ఉత్పాదకత తగ్గిపోయిందని 14 శాతం మహిళలు తెలిపారు.

"కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక సృష్టి గణనీయంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ల రాకతో సాంకేతిక వృద్ధిలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. జీవన నాణ్యత మెరుగయినప్పటికీ కొంత ప్రతికూల ప్రభావం పడింది" - ఆస్కార్ ఓవిడో, క్వీన్స్​లాండ్ వర్సిటీ పరిశోధకులు

కారు డ్రైవింగ్ ఫోన్ మాట్లాడటం హానికరం

ఫోన్లు ఎక్కువగా వాడుతుండటం వల్ల 8.4శాతం మంది మహిళలు, 7.9శాతం మంది పురుషులు తీవ్రమైన వేదనలకు గురవుతున్నట్టు పరిశోధకులు చెప్పారు. ఆందోళన, ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదముందని తెలిపారు. వీలైనంత వరకు నిద్ర సమయంలో, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్​కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details