అంతర్జాతీయ సమాజానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదం, దాని సంబంధిత నేరాలను ఉపేక్షించరాదని భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ విధానాలకు తావుండరాదని సూచించింది. ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సమాఖ్య ఆధ్వర్యంలో శాంతి, భద్రత, సుస్థిరతను నెలకొల్పేలా పరస్పర సహకారం, తీవ్రవాదం, వ్యవస్థాగత నేరాల నియంత్రణ అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ పాల్గొన్నారు. తీవ్రవాదం- వ్యవస్థాగత నేరాలు అంతర్జాతీయ సమాజానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు .
తీవ్రవాదం ప్రతిరోజూ తనరూపురేఖలు మార్చుకుంటోందనారు అక్బరుద్ధీన్. దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు నూతన సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరముందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ విధానాలకు తావుండరాదని సూచించారు.