తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో దాడులు- ఒక్క నెలలో 305మంది మృతి - లక్షిత దాడులు

అఫ్గానిస్తాన్​లో జరిగిన వివిధ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో 20 శాతం పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది. వివిధ దాడుల్లో ఒక్క నెలలోనే 305 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

Targeted attacks kill 305 Afghans in a month
లక్షిత దాడుల్లో గత నెల 305మంది అఫ్గాన్​ పౌరులు మృతి

By

Published : Apr 3, 2021, 11:41 AM IST

అఫ్గానిస్తాన్​లో మార్చి నెలలో జరిగిన వరుస పేలుళ్లు, లక్షిత దాడుల్లో కనీసం 305 మంది పౌరులు మరణించగా, మరో 350 మంది గాయపడ్డారని 'టోలో న్యూస్' నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో మరణాలు 20 శాతం పెరిగాయి.

అయితే ఇవి మీడియాతో పంచుకున్న గణాంకాలు మాత్రమే కాగా.. యుద్ధాల్లో మరణించిన వారే అధికంగా ఉన్నారని భద్రతా దళాలు తెలిపాయి. రోజుకు కనీసం 20-30 మంది అఫ్గాన్​ సైనికులు మరణిస్తున్నట్లు వెల్లడించాయి.

కాబుల్, నంగార్హర్, కాందహార్, హెల్మాండ్, బాల్ఖ్, ఘజ్నీ ప్రావిన్సులలో దాడులు ఎక్కువగా జరిగాయని టోలో న్యూస్ నివేదిక తెలిపింది. తాలిబన్లే ఈ దాడులు చేస్తున్నా.. కొన్నింటికి మాత్రమే వారు బాధ్యత వహిస్తున్నారని.. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి రహమతుల్లా అందర్ వివరించారు.

అఫ్గాన్​లో ఫిబ్రవరిలో జరిగిన పేలుళ్లు, దాడుల్లో 278 మంది మరణించగా.. 264 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి:ఇండోనేషియా చర్చి దాడిలో ఉగ్రవాద దంపతులు!

ABOUT THE AUTHOR

...view details