జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించేవరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు విషయంలో భారత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఒక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
'ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే భారత్‌తో చర్చలు' - స్వయం ప్రతిపత్తి రద్దుపై ఇమ్రాన్ ఖాన్
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు విషయంలో భారత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించేవరకు ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.
'ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే భారత్‌తో చర్చలు'
అంతకు ముందు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీర్ ప్రజలకు భారత్ ఉపశమనం కల్పించిన తర్వాతే పాక్ చర్చలు జరుపుతుందని చెప్పారు. జమ్ముకశ్మీర్ అంశం ఐరాస అజెండాలోనూ ఉన్నందువల్ల అది ఎంత మాత్రం భారత్ అంతర్గత విషయం కాదన్నారు.