నోబెల్ గ్రహీత.. పాకిస్థానీ సామాజిక కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్‌కు మరోమారు బెదిరింపులు వచ్చాయి. తొమ్మిదేళ్ల క్రితం.. ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ తాలిబన్ ఉగ్రవాదే ఇప్పుడూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 'ఈసారి గురి తప్పే ప్రసక్తే లేదు' అంటూ ట్వీట్ చేశాడు ఎసానుల్లా ఎసాన్.
"పాకిస్థాన్‌కి రా? అప్పుడు గురి తప్పింది, ఈసారి తప్పే ప్రసక్తే లేదు," అని మలాలాని ఉర్దూలో ట్విట్టర్ వేదికగా బెదిరించాడు ఎసాన్. దాంతో వెంటనే అతని ట్వట్టర్ ఖాతాని తొలగించింది.
ఉగ్రవాది ట్వీట్‌పై మలాలా స్పందించారు. పాకిస్థానీ నిఘా విభాగం కస్టడీలో ఉన్న ఎసాన్ ఎలా తప్పించుకున్నారో చెప్పాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని, సైన్యాన్ని మలలా ప్రశ్నించారు.
తొమ్మిదేళ్ల క్రితం మలాలాని తుపాకీతో కాల్చి తీవ్రంగా గాయపరిచాడు ఎసాన్. 2014లో పాక్ ఆర్మీ పాఠశాలపై దాడి చేసి 134 మందిని(అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు) కేసులో ఎసాన్ని 2017లో అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు పాక్ నిఘావిభాగం కస్టడీలో ఉన్నాడు. కానీ 2020లో తప్పించున్నాడు. అతను ఎలా తప్పించుకున్నాడనే విషయంపై చాలా వివాదాలే ఉన్నాయి. ప్రస్తుతం అతను టర్కీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కస్టడీలో ఉన్నన్ని రోజులు ఎసాన్ పై ఆర్మీ ఎలాంచి అభియోగాల్ని మోపకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి:మనం ప్రశాంతంగా జీవించవచ్చు : మలాలా