తెలంగాణ

telangana

ETV Bharat / international

వీధుల్లో నిశ్శబ్దం.. గుండెల్లో అలజడులు - తాలిబన్

అఫ్గాన్​ రాజధాని కాబుల్​లో పూర్తి ప్రశాంత వాతావరణం ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు తాలిబన్లు. నగరంలో గస్తీ కాస్తున్నారు. కాగా, భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

Taliban in Kabul
తాలిబన్

By

Published : Aug 16, 2021, 10:55 PM IST

కాబుల్​ను ఆదివారం చేజిక్కోవడం ద్వారా అఫ్గానిస్థాన్​లోని ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు.. రాజధానిలో పహారా కాస్తూ పరిస్థితి పూర్తి ప్రశాంతంగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని.. ప్రశాంతంగా కనిపించే వీధులకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేశారు.

కాబుల్​లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మోహరించిన తాలిబన్లు

భారీగా ఆయుధాలతో ఉన్న తాలిబన్ ఫైటర్లు కాబుల్​ వ్యాప్తంగా గస్తీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో మరోసారి మహిళల హక్కులను కాల రాస్తూ తాలిబన్లు అరాచక పాలన చేయనున్నారనే భయాందోళనలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. వేలాది మంది దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

అఫ్గాన్​ విదేశాంగ శాఖ కార్యాలయం మార్గంలో చెక్​పాయింట్​ వద్ద తాలిబన్ ఫైటర్ల పహారా

నిశ్శబ్దం..

ఇక యూఎస్​ రాయబార కార్యలయం నుంచి తమ సిబ్బందిని తరలించేందుకు అమెరికా హెలికాప్టర్​లు చక్కర్లు కొట్టడం కనిపించింది. రాజధానిలో ఉద్రిక్తకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. సాయుధులు దొంగతనాలకు పాల్పడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఖైదీలను తాలిబన్లు విడిచి పెట్టినట్లు తెలుస్తోంది.

చెక్​పాయింట్​ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న తాలిబన్లు

దేశం నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగకముందే తాలిబన్లకు మోకరిల్లాయి అఫ్గాన్​ సేనలు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో అఫ్గాన్​లో పరివర్తనం తీసుకురావాలన్న అమెరికా సహా మిత్ర దేశాల ఉద్యమం ముగిసిపోయింది.

చమన్​ సరిహద్దు ప్రాంతం నుంచి పాకిస్థాన్​లోకి వెళుతున్న ప్రజలు

ఇదీ చూడండి:తాలిబన్ల మెరుపు వేగానికి కారణం.. ఈ దళం!

ABOUT THE AUTHOR

...view details