పాకిస్థాన్లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) ఉగ్రముఠాకు చెందిన సభ్యుడు (suicide bomber) ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు(suicide attack in pakistan). ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర రాజధాని క్వెట్టా నగరంలోని మస్టుంగ్ రోడ్ చెక్పాయింట్లోని భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు.. నగర డీఐజీ అజార్ అక్రమ్ తెలిపారు. ఆ బలగాలు రాష్ట్రంలోని ఉగ్రవాద నిర్మూలన కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. గాయపడిన 20 మందిలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. ఇద్దరు స్థానికులుగా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. కాబుల్లో తాలిబన్(Afghanistan Taliban) ప్రభుత్వం వచ్చిన క్రమంలో టీటీపీని అదుపు చేయొచ్చనే పాకిస్థాన్ ఆలోచన సరైంది కాదనే సంకేతాలను పంపేందుకే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఖండించిన ప్రధాని..