తెలంగాణ

telangana

ETV Bharat / international

100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు విడుదల - అఫ్గాన్ తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లోని ప్రజలపై అరాచకత్వాన్ని ప్రదర్శిస్తున్న తాలిబన్లు.. సాటి ఉగ్రవాదులపై మాత్రం ప్రేమ కనబరుస్తున్నారు. అఫ్గాన్​ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వంద మందికి పైగా ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. విడుదలైన వారిలో తెహ్రీక్‌ తాలిబన్‌ ఉగ్రవాదులు సైతం ఉన్నారు.

Taliban love
తాలిబన్ల ప్రేమ

By

Published : Aug 21, 2021, 2:15 PM IST

అఫ్గనిస్తాన్‌లోకి ప్రవేశించిన వారం రోజుల లోపే అరాచకత్వాన్ని ఆకాశానికి అంటించిన తాలిబన్లు సాటి ఉగ్రవాదుల పట్ల మాత్రం సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. అఫ్గన్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వంద మందికి పైగా పాకిస్తాన్‌ ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు.

విడుదలైన వారిలో తెహ్రీక్​ ఏ తాలిబన్‌ పాకిస్తాన్‌ ఉగ్ర సంస్ధకు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా వంద మందికి పైగా ఉగ్రవాదులు ఉన్నారు. విడుదలైన తర్వాత పలువురు ఉగ్రవాదులు తమ సంస్ధలో తిరిగి చేరారు.

అల్‌ఖైదా నుంచి సైద్ధాంతిక మార్గదర్శనం పొందుతున్న తెహ్రీకే తాలిబన్‌ పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అల్‌ ఖైదా, ఐసిస్‌కు చెందిన ఉన్నత స్ధాయి కమాండర్లను కూడా తాలిబన్లు విడుదల చేశారు.

ఇవీ చదవండి:Taliban news: రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పంటించిన తాలిబన్లు!

ABOUT THE AUTHOR

...view details