తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐసిస్​పై తాలిబన్ల రివెంజ్​- అనేక మంది హతం!

ఐసిస్​ ఉగ్రవాదుల స్థావరంపై తాలిబన్లు(Afghanistan Taliban) దాడులు జరిపారు. ఈ ఘటనలో పలువురు ముష్కరులను ముట్టుబెట్టారు. కాబుల్​లోని మసీదుపై దాడికి ప్రతీకారంగా తాలిబన్లు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

taliban raid on is hideout
ఐసిస్​పై తాలిబన్ల దాడులు

By

Published : Oct 4, 2021, 12:36 PM IST

ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదులపై తాలిబన్లు(Afghanistan Taliban) ప్రతీకార దాడికి దిగారు. అఫ్గానిస్థాన్ కాబుల్​లోని(Afghan news) ఐసిస్ స్థావరంపై దాడులు జరిపి.. పలువురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారని సమాచారం.

కాబుల్​లోని ఓ మసీదుపై బాంబు దాడి జరిగిన కొద్ది గంటల్లోనే తాలిబన్లు(Afghanistan Taliban) ఈ ఆపరేషన్ చేపట్టడం గమనార్హం.

ఐసిస్​పై అనుమానంతో..

కాబుల్​లోని(Afghan news) ఈద్గా మసీదుపై ఆదివారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు చనిపోయారు. తాలిబన్​ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్​ తల్లి స్మారక కార్యక్రమం జరుగుతున్న క్రమంలో.. మసీదుపై ఈ దాడి జరిగింది. ఇందుకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదు. అయితే తాలిబన్ల ప్రభుత్వానికి ఐసిస్​ నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా.. వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని తాలిబన్లు అనుమానించారు. ఈ క్రమంలోనే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ తాజా ఆపరేషన్​ చేపట్టినట్లు తెలుస్తోంది.

"ఉత్తర కాబుల్​లోని ఖైర్ ఖానా పరిసర ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ స్థావరంపై తాలిబన్(Afghanistan Taliban) బలగాలు దాడులు నిర్వహించాయి" అని ముజాహిద్​ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే.. ఎంతమంది ముష్కరులు మరణించారు, ఎంత మంది గాయపడ్డారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అఫ్గాన్​లో తాలిబన్లు(Afghanistan Taliban) అధికార పగ్గాలు చేపట్టాక ఈద్గా మసీదుపై జరిగిన ఈ బాంబు దాడి అత్యంత భీకరమైనది కావడం గమనార్హం.

అంతకుముందు.. ఆగస్టు 26న కాబుల్​ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 169 మందికి పైగా అప్గాన్​ పౌరులు, 13 మంది అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్ల పాలన నుంచి తప్పించుకుని విదేశాలకు వెళ్లేందుకు కాబుల్​ విమానాశ్రయానికి వేలాది మంది చేరుకున్న క్రమంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి తామే చేశామని ఐసిస్ ప్రకటించింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details