తెలంగాణ

telangana

ETV Bharat / international

Afghan Taliban: ఇంద్రభవనం లాంటి ఇంట్లో తాలిబన్లు - అఫ్గానిస్థాన్​ తాలిబన్​ న్యూస్​

అఫ్గానిస్థాన్‌లో ఇంద్రభవనం లాంటి ఓ ఇల్లు తాలిబన్ల(Afghan Taliban) చేతికి చిక్కింది. ఆధునిక సదుపాయాలతో ఉన్న ఆ నివాసంలో ఇప్పుడు దాదాపు 150 మంది ముఠా సభ్యులు ఉంటున్నారు. సర్వాంగ సుందరంగా ఉన్న ఇంటిని చూసి అచ్చెరువొందుతున్నారు.

Taliban occupied palace of afghan ex vice president disthams
ఇంద్రభవనం లాంటి ఇంట్లో తాలిబన్లు

By

Published : Sep 13, 2021, 10:01 AM IST

విశాలమైన గదులు.. సుతిమెత్తని పరుపులు.. ఇంట్లోనే ఈతకొలను.. వ్యాయామశాల, విదేశీ మద్యం సీసాలతో నిండిన బార్‌.. వీటన్నింటితో కూడిన ఇంద్రభవనం లాంటి ఓ ఇల్లు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల(Afghan Taliban) చేతికి చిక్కింది. ఆధునిక సదుపాయాలతో ఉన్న ఆ నివాసంలో ఇప్పుడు దాదాపు 150 మంది ముఠా సభ్యులు ఉంటున్నారు. సర్వాంగ సుందరంగా ఉన్న ఇంటిని చూసి అచ్చెరువొందుతున్నారు. ఇంతకీ ఆ నివాసం ఎవరిదో తెలుసా..? అఫ్గానిస్థాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రషీద్‌ దోస్తమ్‌ది.

దోస్తమ్‌ (67) తాలిబన్లకు బద్ధ శత్రువు. గతంలో పారాట్రూపర్‌గా, కమ్యూనిస్టు కమాండర్‌గా, దేశానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో రెండు వేల మందికి పైగా తాలిబన్‌ ముఠా సభ్యులను హతమార్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. కంటెయినర్లలో బంధించి ఎడారిలో వదిలేయడంతో.. ఊపిరాడక వారంతా మరణించినట్లు చెబుతుంటారు. ఇటీవల తాలిబన్లు(Taliban News) విజృంభించాక ప్రాణభయంతో దోస్తమ్‌ అఫ్గాన్‌ను వీడి ఉజ్బెకిస్థాన్‌కు పరారయ్యారు. దీంతో కాబుల్‌లో సకల వసతులతో ఆయన నిర్మించుకున్న ఇంటిని తాలిబన్లు గత నెల 15న స్వాధీనం చేసుకున్నారు.

తాలిబన్లలోని శక్తిమంతమైన కమాండర్లలో ఒకరైన కారీ సలాహుద్దీన్‌ అయౌబీ తన భద్రత సిబ్బందితో కలిసి అందులో ఉంటున్నారు. ఇన్నాళ్లూ కొండలు, లోయల్లో నివసించిన.. ముఠా సభ్యులు ఆ ఇంట్లోని హంగులను ఆశ్చర్యంగా చూస్తున్న ఫొటోలు తాజాగా బయటికొచ్చాయి. అయితే- తమ ముఠా సభ్యులు ఆ భవనంలోని విలాసాలకు అలవాటు పడబోరని అయౌబీ చెప్పారు.

ఇదీ చదవండి:'కళ్ల ముందే ఉన్నా.. అమెరికా నన్ను పట్టుకోలేకపోయింది!'

ABOUT THE AUTHOR

...view details