తెలంగాణ

telangana

ETV Bharat / international

Afghan Taliban: 'తాలిబన్ల నుంచి సానుకూల సంకేతాలు' - తాలిబన్ న్యూస్​ లేటెస్ట్​

భారత్ ఆందోళనలను పరిష్కరించడానికి తాలిబన్ల ప్రభుత్వం(Afghanistan Taliban) సానుకూలంగా వ్యవహరించే అవకాశముందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష వర్ధన్‌ ష్రింగ్లా అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా-భారత్​ మధ్య 2+2 నేతల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

taliban may consider india's concerns says shringla
'భారత్ ఆందోళనలను తాలిబన్ల పరిష్కారం'

By

Published : Sep 4, 2021, 9:48 AM IST

Updated : Sep 4, 2021, 11:28 AM IST

అఫ్గానిస్థాన్‌లో ఏర్పాటు కాబోయే నూతన తాలిబన్‌ ప్రభుత్వం(Afghanistan Taliban).. భారత్ ఆందోళనలను పరిష్కరించడానికి సానుకూలంగా వ్యవహరించే అవకాశముందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష వర్ధన్‌ ష్రింగ్లా అన్నారు. అఫ్గాన్‌ భూభాగం ఉగ్రవాద కార్యకలాపాలకు(Afghan Terrorist) కేంద్రంగా మారే అవకాశముందన్న భారత్‌ ఆందోళనను తాలిబన్‌ ప్రభుత్వం(Taliban Sarkar) పరిగణనలోకి తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అమెరికాలో మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా మాట్లాడిన హర్షవర్ధన్.. అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్​ చర్యలను భారత్‌- అమెరికాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు భారత్‌-అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరుదేశాలు అడుగులు వేయాలని ఈ పర్యటనలో అంగీకారం కుదిరినట్లు హర్షవర్ధన్‌ అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో ఇరు దేశాల మధ్య 2+2 నేతల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:Afghan Crisis: పంజ్​షేర్ తాలిబన్ల వశమైందా?

Last Updated : Sep 4, 2021, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details