అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ హెల్మండ్ రాష్ట్రంలోని సైనిక స్థావరంలో బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది అఫ్గాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది
సంగిన్ జిల్లాలోని సైనిక స్థావరంలో ఓ సొరంగాన్ని తవ్వి అందులో బాంబు పేల్చినట్లు ఓ సైనిక ప్రతినిధి తెలిపారు. బాంబు దాడి అనంతరం తాలిబన్లు అఫ్గాన్ సైనికుల మధ్య కాల్పులు జరిగాయి.
"సైనిక స్థావరంలో 18 మంది సైనికులు పహారా కాస్తున్నారు. బాంబు దాడిలో 10 మంది మరణించగా నలుగురు సైనికులు గాయపడ్డారు. మరో నలుగురు తాలిబన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. "