అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో తాలిబన్లు(Afghan taliban news) ఆదివారం బల ప్రదర్శన(Taliban military parade) నిర్వహించారు. వీటిల్లో అమెరికా సాయుధ వాహనాలు, రష్యా హెలికాప్టర్లు ఉన్నాయి. ఆగస్టులో పౌర ప్రభుత్వం కుప్పకూలి.. తాలిబన్లు అధికారంలోకి రావడం వల్ల వారు ఈ ఆయుధాలను(Taliban military power 2021) స్వాధీనం చేసుకొన్నారు. తాలిబన్ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ కవాతు(Taliban military parade) నిర్వహించారు.
ఈ కవాతులో అమెరికా తయారు చేసిన ఎం117 సాయుధ వాహనాలు, ఎం-17 హెలికాప్టర్లు, అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్ తుపాకులు వంటి వాటిని ప్రదర్శించారు. అఫ్గాన్ జాతీయ దళాల్లో పనిచేసిన పైలట్లు, మెకానిక్‌లను తాజాగా తమ బలగాల్లో చేర్చుకొంటున్నట్ల తాలిబన్ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్లు(Afghan taliban news) ఇటీవల మిలటరీ దుస్తులను వాడటం మొదలు పెట్టారు. గతంలో తాలిబన్ ఫైటర్లు కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించేవారు.