అధికారం చేజిక్కించుకున్నాక తాలిబన్లు కొద్ది గంటల క్రితం అఫ్గాన్ పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు. అక్కడ నాయకుల కుర్చీల్లో వారు రైఫిల్స్ తీసుకొని కూర్చొని వీడియోలు చిత్రీకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను జర్నలిస్టు, వ్యాపారవేత్త అయిన వాజాత్ ఖాజ్మీ ట్వీట్ చేశారు. రెండు వారాల క్రితం ఇదే భవనంలో దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించారు.
తాలిబన్లు 1996లో అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించే క్రమంలో నాటి పార్లమెంట్ భవనం దార్ ఉల్ అమన్‌ను బాంబులతో పేల్చేశారు. కానీ, అమెరికా దాడిచేసి తాలిబన్లను తరిమి కొట్టాక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రభుత్వం కోసం ఈ భవనాన్ని భారత్ నిర్మించింది. 2015 డిసెంబర్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అఫ్గాన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ భవన నిర్మాణం కోసం భారత్ 90 మిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. ఇప్పటికే భారత్ నిర్మించిన సల్మా డ్యామ్ సహా పలు ప్రాజెక్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకొన్నారు.
పార్కుల్లో ఆటలు..