తెలంగాణ

telangana

ETV Bharat / international

సంబరాల పేరుతో 17 మందిని కాల్చి చంపిన తాలిబన్లు - తాలిబన్ల కాల్పుల్లో అప్గాన్​ పౌరులు మృతి

అఫ్గాన్​లోని పంజ్​షేర్ లోయ​లో(Talbian in Panjshir) విజయం సాధించామంటూ కొందరు తాలిబన్లు(Afghan taliban) గాల్లోకి కాల్పులు జరుపుతూ శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనలో 17మంది అఫ్గాన్​ పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 41 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Taliban fire weapons into air
తాలిబన్​ కాల్పుల్లో 17 మంది మృతి

By

Published : Sep 5, 2021, 10:47 AM IST

తాలిబన్ల(Afghan taliban) అతి ప్రవర్తనకు 17 మంది బలయ్యారు! మరో 41 మంది గాయపడ్డారు. పంజ్‌షేర్‌లో(Talbian in Panjshir) పైచేయి సాధించామంటూ కొందరు తాలిబన్లు.. శుక్రవారం రాత్రి కాబుల్‌లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపారు. తుపాకులు గురితప్పడం వల్ల ప్రాణనష్టం జరిగిందని 'టోలో టీవీ' వెల్లడించింది.

అయితే.. ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని కాబుల్‌లోని, ఎమర్జెన్సీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాల్పుల ఘటనను తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ఖండించారు. ఈ పద్ధతిని వెంటనే మానుకోవాలని, కాల్పులు జరపవద్దని క్షేత్రస్థాయి నేతలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details