తెలంగాణ

telangana

ETV Bharat / international

తాలిబన్ల దుశ్చర్య- తండ్రిపై అనుమానంతో పిల్లాడికి మరణశిక్ష! - Afghan resistance forces

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు(Afghanistan Taliban) తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. తఖార్​ ప్రాంతంలో చిన్న పిల్లాడికి (Taliban Executes Child) మరణశిక్ష విధించారు. తండ్రి.. తిరుగుబాటు దళ సభ్యుడనే అనుమానంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Taliban Executes Child, Suspected Father Was Resistance Member: Report
తాలిబన్ల దుశ్చర్య, taliban, taliban fighters

By

Published : Sep 28, 2021, 1:29 PM IST

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు(Afghanistan Taliban).. వరుస దురాఘతాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత పాశవిక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

తఖార్​ ప్రాంతంలో.. ఓ చిన్న పిల్లాడికి మరణశిక్ష విధించారు తాలిబన్లు (Taliban Executes Child). అతడి తండ్రిని.. అఫ్గాన్​ రెసిస్టెన్స్​ ఫోర్స్​(తిరుగుబాటు దళం) సభ్యుడిగా అనుమానించే ఈ చర్యకు పూనుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పంజ్​షేర్​లోని ఓ ప్రతినిధి ట్వీట్​ చేశారు.

''తండ్రి రెసిస్టెన్స్​ బృందంలో ఉన్నాడనే అనుమానంతో.. తఖార్​ ప్రావిన్స్​లో చిన్నపిల్లాడిని తాలిబన్​ ఫైటర్లు చంపేశారు. #WarCrimes #Afghanistan''

- పంజ్​షేర్​ ప్రతినిధి

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తర్వాత.. తాలిబన్లు (Afghanistan Taliban) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ప్రపంచ దేశాలు తమను అధికారికంగా గుర్తిస్తాయని తాలిబన్లు (Taliban news) ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మహిళలపై ఆంక్షలు, నో షేవింగ్​..

తొలుత శాంతియుతంగానే కాబుల్​ను ఆక్రమించుకున్నట్లు కనిపించిన తాలిబన్లు.. మెల్లమెల్లగా ఒకప్పటి పాలనను గుర్తుకుతెస్తున్నారు.

  • కొద్దిరోజుల కింద హెరాత్​ నగరంలో వ్యాపారిని కిడ్నాప్​ చేసిన వారికి కఠిన శిక్షను అమలు చేశారు తాలిబన్లు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురిని కాల్చిచంపారు(Afghanistan crime news). అనంతరం వారిలో ఒకరి మృతదేహాన్ని నగరంలోని ప్రధాన కూడలి వద్ద క్రేన్​కు వేలాడదీశారు.
  • హెల్మాండ్​ ప్రావిన్స్​లో స్టైల్​గా హెయిర్​ కటింగ్​, గడ్డం చేయకుండా(trimming beard and mustache).. బార్బర్లపై నిషేధం విధించారు.
  • కాబుల్​లో పనిచేసే మహిళలు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఆదేశాలిచ్చింది తాలిబన్​ ప్రభుత్వం. డిజైనింగ్‌, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తదితర పనుల్లో నైపుణ్యం కలిగిన వారికి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పింది. ఈ పూర్తి కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్​లో మహిళల విద్యపైనా ఆంక్షలు విధించి.. వారి స్వేచ్ఛను హరించివేశారు తాలిబన్లు.
  • పౌరులపై అనేక ఆంక్షలు అమలు చేసిన తాలిబన్లు.. మీడియాపైనా కఠిన నిబంధనలను విధించారు. దీంతో అఫ్గాన్‌లోని జర్నలిస్టులు భయపడిపోతున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాసంస్థ తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు ఉంటాయని తాలిబన్​ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా తురాబీ ప్రకటించడం గమనార్హం. ఆయన ప్రకటించిన కొద్దిరోజులకే.. ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

ఇవీ చూడండి: Afghanistan Taliban: కాళ్లు, చేతులు నరికే శిక్షలు మళ్లీ వస్తాయ్​..

Taliban news: తాలిబన్ల పాలనలో తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలా..

taliban girls education: అబ్బాయిలకే చదువులు.. అమ్మాయిలు ఇళ్లకే!

ABOUT THE AUTHOR

...view details