తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో కాల్పుల విరమణకు తాలిబన్​ అంగీకారం - Taliban on peace agreement

అఫ్గానిస్థాన్​లో 18 ఏళ్లుగా సాగుతోన్న మారణహోమానికి బ్రేక్​ పడింది. తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తాలిబన్​ సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం శాంతి ఒప్పందానికి ఓ అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే.. 10 రోజుల్లోనే తాలిబన్ల కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుందని సమాచారం.

Taliban
అఫ్గాన్​లో కాల్పుల విరమణకు తాలిబన్లు అంగీకారం

By

Published : Dec 30, 2019, 6:06 AM IST

Updated : Dec 30, 2019, 8:08 AM IST

అఫ్గాన్​లో కాల్పుల విరమణకు తాలిబన్​ అంగీకారం

అఫ్గానిస్థాన్​లో సుదీర్ఘ కాలంగా జరుగుతోన్న మారణహోమం నుంచి కాస్త ఊరట లభించింది. దేశవ్యాప్తంగా తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించింది తాలిబన్​ సంస్థ. శాంతి చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాలిబన్​ సంస్థ ప్రస్తుత నిర్ణయం అగ్రరాజ్యం అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఓ అవకాశంగా కనిపిస్తోంది.

10 రోజుల పాటు..!

కాల్పుల విరమణకు తాత్కాలికంగా ఒప్పుకున్న తాలిబన్​ సంస్థ .. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే అంశంపై స్పష్టతనివ్వలేదు. కానీ.. 10 రోజుల పాటు మాత్రమేమని తాలిబన్​ శాంతి చర్చల ప్రతినిధి ఒకరు సూత్రప్రాయంగా తెలిపారు.

18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం..

తాలిబన్లతో అమెరికా శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గత సెప్టెంబర్​లో​ అర్ధాంతరంగా చర్చలు ముగించిన అధ్యక్షుడు ట్రంప్​.. ఇటీవలే పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందం కుదిరితే అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, 18 ఏళ్ల సుదీర్ఘ మిలటరీ ఒప్పందానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్గాన్​లో 12వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు.

అఫ్గానిస్థాన్​ను ఉగ్రవాద సంస్థలకు నిలయంగా కాకుండా చేసేందుకు, అలాగే ఇతర అంశాల్లో తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది అమెరికా. అయితే తాలిబన్ల​ అధినేత ఈ ఒప్పందానికి అంగీకరించాల్సి ఉంటుంది. కానీ అది జరిగే అవకాశం కనిపించటం లేదు.

ఇదీ చూడండి: సౌదీ మంత్రాంగం..'కశ్మీర్'​పై ఓఐసీ భేటీకి ప్రణాళిక

Last Updated : Dec 30, 2019, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details