తెలంగాణ

telangana

ETV Bharat / international

కాబుల్​ పేలుళ్లను ఖండించిన తాలిబన్లు

కాబుల్‌ విమానాశ్రయం వద్ద పేలుళ్ల ఘటనను తాలిబన్లు ఖండించారు. అమెరికా బలగాలున్న ప్రాంతంలోనే పేలుళ్లు జరిగాయని స్పష్టం చేశారు. పేలుళ్లకు అమెరికా బలగాలే బాధ్యత వహించాలన్నారు తాలిబన్లు.

Taliban
తాలిబన్లు

By

Published : Aug 27, 2021, 5:48 AM IST

Updated : Aug 27, 2021, 6:50 AM IST

కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద పేలుళ్లను తాలిబన్లు ఖండించారు. ఈ పేలుళ్లుకు అమెరికా బలగానే బాధ్యత వహించాలన్నారు. అగ్రరాజ్యం బలగాలున్న ప్రాంతంలోనే ఈ పేలుళ్లు జరిగాయని స్పష్టం చేశారు. " మా గ్రూప్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. అని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ అన్నారు.

పేలుళ్లను ఖండించిన ఐరాస..

మరోవైపు.. కాబుల్​ విమానాశ్రయం వద్ద పేలుళ్ల దాడిని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఖండించింది. ఈ ఘటన అఫ్గాన్‌లోని దారుణ పరిస్థితిని తెలియజేస్తోందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. ప్రపంచ సంస్థగా.. అఫ్గాన్​కు తక్షణసాయం చేసేందుకు బలోపేతం అవుతామన్నారు.

అఫ్గానిస్థాన్​లోని కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల వరుస దాడులు జరిగాయి. దేశం విడిచి వెళ్లిపోయేందుకు వేలాది మంది ఎయిర్​పోర్ట్​ బయట వేచిచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనల్లో 72 మంది మరణించారని తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని చెప్పారు. కాగా, గాయాలతో సుమారు 143 మంది ఆసుపత్రిలో చేరినట్లు కాబుల్​ లోని ఎమర్జెన్సీ ఆస్పత్రి వెల్లడించింది.

ఇవీ చదవండి:కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడులు- 13 మంది మృతి

Taliban: 'పాకిస్థాన్ మా రెండో ఇల్లు'- తాలిబన్ల ప్రకటన

Last Updated : Aug 27, 2021, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details