తెలంగాణ

telangana

ETV Bharat / international

'తాలిబన్​ ప్రభుత్వానికి త్వరలోనే అంతర్జాతీయ గుర్తింపు' - ఇస్లామిక్​ ఎమిరేట్స్​ ఆఫ్​ అఫ్గానిస్థాన్​

ఇస్లామిక్​ ఎమిరేట్​ ఆఫ్​ అఫ్గానిస్థాన్​ ప్రభుత్వానికి(taliban government) త్వరలోనే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తాలిబన్లు(Afghanistna Taliban). అందుకు తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులు అఫ్గాన్​ను సందర్శించినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా తాలిబన్లకు మద్దతుగా నిలుస్తున్న పాకిస్థాన్​కు అభినందలను తెలిపారు.

Taliban
అఫ్గానిస్థాన్, తాలిబన్​

By

Published : Sep 27, 2021, 10:55 AM IST

Updated : Sep 27, 2021, 2:50 PM IST

తాలిబన్ల పాలనను(taliban government) అంతర్జాతీయ సమాజం త్వరలోనే గుర్తిస్తుందని అఫ్గానిస్థాన్​ తాత్కాలిక ప్రభుత్వ సమాచార, సాంస్కృతి శాఖ సహాయ మంత్రి, తాలిబన్(Afghanistna Taliban)​ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. పలు దేశాల ప్రతినిధులు ఇప్పటికే అఫ్గాన్​ను సందర్శించారని తెలిపారు. ఈ మేరకు ముజాహిద్ వ్యాఖ్యలను​ ఖామా ప్రెస్ వెల్లడించింది. ​

"తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి అధినేతకు లేఖ రాశాం. ప్రభుత్వానికి గుర్తింపు లభించటం మా హక్కు.. అందుకోసం తాలిబన్​ నేతలు ఐరాసతో చర్చిస్తున్నారు."

- జబిహుల్లా ముజాహిద్​, తాలిబన్​ అధికార ప్రతినిధి.

మహిళలు, మానవ హక్కులను గౌరవించటం(human rights in Afghanistan), సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఉగ్రవాదానికి అఫ్గాన్(terrorism in afghanistan)​ వేదిక కాకుండా చూసుకోవాలని అంతర్జాతీయ సమాజం షరతులు విధించింది. వాటిని అమలు చేస్తామని మొదటగా హామీ ఇచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అవేమీ కనిపించలేదు. మరోవైపు.. రష్యా, అమెరికా, జపాన్​, కెనడా, ఫ్రాన్స్​, యూకే.. తాలిబన్​ ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని తేల్చిచెప్పాయి.

పాకిస్థాన్​పై ప్రశంసలు..

అంతర్జాతీయంగా ఇస్లామిక్​ స్టేట్​ ఆఫ్​ అఫ్గానిస్థాన్​ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నందుకు పాకిస్థాన్​పై ప్రశంసలు కురిపించారు తాలిబన్లు. అఫ్గాన్​తో సంబంధాలు కొనసాగించాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్థాన్​ కోరుతోందని తాలిబన్​ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​ తెలిపారు. ' పాకిస్థాన్​ మా పొరుగు దేశం. అఫ్గాన్​ పట్ల పాకిస్థాన్​ వైఖరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పాకిస్థాన్​లోని పెషావర్​తోపాటు ఇతర నగరాలతో రోడ్డు మార్గం ద్వారా అనుసంధానమై ఉంటాం. అఫ్గాన్​, పాకిస్థాన్​ మధ్య సంబంధాలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పాకిస్థాన్​ సందర్శనకు తాలిబన్​ నేతలకు ఆహ్వానం అందితే తప్పకుండా ఆలోచిస్తాం.' అని తెలిపారు.

తాలిబన్లకు ట్విట్టర్​ షాక్​...

తాలిబన్లకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టట్​ షాక్​ ఇచ్చింది. అఫ్గాన్​ ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖల ట్విట్టర్​ ఖాతాల బ్లూ టిక్​ మార్క్​ను తొలగించింది. అందులో విదేశాంగ, రక్షణ, అంతర్గత వ్యవహారాల శాఖతో పాటు అధ్యక్ష భవనం, నేషనల్​ ప్రొక్యూర్​మెంట్​ అథారిటీలు ఉన్నాయి. అలాగే.. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్​ ఖాతా బ్లూ టిక్​ను తొలగించింది.

మరోవైపు.. అఫ్గాన్​ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్​ ఘనీ, హమిద్​ కర్జాయ్​, అబ్దుల్లా అబ్దుల్లాల ఖాతాల బ్లూ టిక్​ మార్క్​ కొనసాగించింది.

ఇదీ చూడండి:సెలూన్లపై ఆ ప్రభుత్వం ఆంక్షలు- షేవింగ్​ చేస్తే అంతే!

Afghan Taliban: తాలిబన్ల పాలనలో మీడియాపై ఉక్కుపాదం..

Last Updated : Sep 27, 2021, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details