అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే మూడింట రెండొంతుల దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా బల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మజార్-ఇ-షరీఫ్.. ఉత్తర అఫ్గాన్‌లో చివరి ప్రధాన నగరం. అఫ్గాన్ సైనిక బలగాలుతో భీకర పోరు అనంతరం ఈ నగరంపై తాలిబన్లు పట్టు సాధించారు. ఈ నగరం నుంచి అఫ్గాన్ సైనికులు పారిపోయినట్లు పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఉత్తర అఫ్గాన్ మొత్తం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు అయింది.
ఫలితంగా దేశ రాజధాని కాబుల్, తూర్పు ప్రాంతంలోని నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జాలాలాబాద్ నగరాలు మాత్రమే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. తాలిబన్లు కాబుల్‌ను కూడా చుట్టుమట్టినట్లు సమాచారం. ఏ క్షణమైనా.. కాబుల్‌ను ఆక్రమించనున్నట్లు తెలుస్తోంది.
పోరాడకుండానే..