తాలిబన్లు అధికారంలోకి వస్తే రెండు దశాబ్దాల క్రితం నాటి వారి అరాచక పాలన మళ్లీ వస్తుందని భయపడుతున్న ప్రజల అంచనాలే నిజమవుతున్నాయి. హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రాహాన్ని వారు పేల్చి వేశారు. బామియాన్‌లో ఉన్న ఈ ప్రతిమను నామరూపాల్లేకుండా చేశారు. గతంలో ఈ ప్రాంతంలోనే బుద్ధుని విగ్రహం, చారిత్రక కట్టడాలను తాలిబన్లు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మానవహక్కుల ఉద్యమకారుడు సలీ జావేద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అఫ్గాన్ ప్రజలకు తాలిబన్లు చాలా పెద్ద క్షమాభిక్ష పెట్టారని మండిపడ్డారు.
హజారా నేత అబ్దుల్ అలీని 1995లోనే తాలిబన్లు ఉరితీశారు. చాలా ఏళ్లుగా ఆ వర్గం వారిపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు.
హజారాలు ఓ సంప్రదాయ తెగ. మధ్య అఫ్గాన్‌లోని పర్వత ప్రాంతం హజారత్లో వారు అధికంగా ఉంటారు. 13 శతాబ్దానికి చెందిన మొంగోల్ రాజ్య స్థాపకుడు గెంఘిస్ ఖాన్‌కు వారసులుగా వీరిని చెప్పుకుంటారు.