ఆగస్టు 15న అఫ్గానిస్థాన్‌ను తమ అధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు(Afghan Taliban).. 31 తర్వాత ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తమ పాలనలో మహిళలకు సమాన హక్కులు(Afghan Women Rights) ఉంటాయని, 1990నాటిలా అణచివేత ఉండదని హమీ ఇచ్చారు. అయితే తాలిబన్లు అధికారికంగా అఫ్గాన్ పగ్గాలు చేపట్టకముందే మహిళల హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు. వారు చేస్తున్న ప్రకటనలు మున్ముందు మహిళలు ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
కో- ఎడ్యుకేషన్‌పై నిషేధం..
అప్గాన్ మహిళల ఉన్నత విద్యకు అనుమతిస్తామని చెప్పిన తాలిబన్లు(Taliban News).. కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇకపై యూనివర్సిటీలలో మహిళలకు పురుషులు బోధించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. తాలిబన్ల తాత్కాలిక ఉన్నత విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బఖి హక్కానీ ఈ మేరకు తెలిపారు. తాము మహిళల హక్కులను గౌరవిస్తామని, కానీ అవి ఇస్లామిక్ చట్టానికి లోబడి ఉండాలని కరాఖండీగా చెప్పారు.
ఆదివారం హక్కానీ.. అఫ్గాన్ యునివర్సిటీల సిబ్బంది, అధ్యాపకులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇందులో ఒక్క మహిళ కూడా పాల్గొనలేదు. అందరూ మగ విద్యార్థులే ఉన్నారు. వ్యవస్థాపరమైన నిర్ణయాల్లో మహిళలను భాగస్వాములను చేయొద్దనే ఉద్దేశంతోనే ఈ సమావేశానికి వారిని అనుమతించలేదని ఓ అధ్యాపకురాలు తెలిపారు. అమ్మాయిలకు మహిళా టీచర్లే బోధించాలంటే.. వారు ఉన్నత విద్యకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ప్రత్యేకంగా బోధించేందుకు సరిపడా వసతులు గానీ, మహిళా ప్రొఫెసర్లు గానీ లేరని వివరించారు.
గత 20 ఏళ్లలో అఫ్గాన్‌లోని యూనివర్సిటీలలో మహిళల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. పురుషులతో పాటు తరగతులకు హాజరవుతున్నారు. అధ్యాపకులతో కలిసి సెమినార్లలో పాల్గొంటున్నారు. ఉన్నత విద్యకు దగ్గరయ్యారు. కానీ కొద్ది నెలులుగా తాలిబన్లు యూనివర్సిటీలపై దాడులు చేసి(Afghan Crisis) చాలా మందిని పొట్టనబెట్టుకున్నారు. దీంతో.. మహిళలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
మహిళలు పాడటానికి వీల్లేదు..
కాందహార్‌లో మహిళా సంగీత కళాశాలలను కూడా మూసివేశారు తాలిబన్లు. వారు టీవీలు, రేడియో ఛానళ్లలో పాడకుండా నిషేధించారు. మహిళల స్వరాన్ని ప్రసారం చేయడానికి వీల్లేదని ఆయా ఛానళ్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఆహారం రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పు..
ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఆగస్టు 17న ఓ మహిళ ఒంటికి నిప్పంటింటారు తాలిబన్లు. వారి అరాచకాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. అంతేగాకుండా.. జిహాదీలను పెళ్లి చేసుకోవాలని యువతులను తాలిబన్లు బలవంతం చేస్తున్నట్లు మాజీ జడ్జి నజ్లా అయుబి కొద్ది రోజుల క్రితమే తెలిపారు. మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలిస్తున్నారని, అక్కడ వారిని సెక్స్ బానిసలుగా మారస్తున్నారనే భయానక విషయాలను వెల్లడించారు.
దేశం వీడిన మహిళా జర్నలిస్టు..