అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు(Afghanistan Taliban).. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కాబుల్‌కు విమాన సేవలు కొనసాగేలా పూర్తి సహకారం అందిస్తామని ఇటీవలే ప్రకటించారు. తాజాగా.. తమ దేశానికి విమానాలను పునరుద్ధరించాలని(flights to afghanistan from india) కోరుతూ భారత పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు.
అఫ్గానిస్థాన్‌లోని కాబుల్‌కు వాణిజ్య విమానాలు(ప్రయాణికులు, సరకు రవాణా) పునరుద్ధరించాలని కోరుతూ డీజీసీఏకు లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లేఖను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.