తెలంగాణ

telangana

ఇండోనేసియా మంత్రిపై కత్తితో ఐఎస్​ ఉగ్రవాది దాడి!

ఇండోనేసియాలో ఏకంగా భద్రతా మంత్రిపైనే హత్యాయత్నం జరిగింది. జావాలోని ఓ విశ్వవిద్యాలయానికి వెళ్లిన మంత్రి విరంటోపై దుండగుడు కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. నిందితుడిని ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

By

Published : Oct 10, 2019, 4:09 PM IST

Published : Oct 10, 2019, 4:09 PM IST

ఇండోనేసియా మంత్రిపై కత్తితో ఐఎస్​ ఉగ్రవాది దాడి

ఇండోనేసియా భద్రతా మంత్రి విరంటోపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆయన తన వాహనం నుంచి దిగుతుండగా రెండుసార్లు కడుపులో కత్తితో పొడిచాడు నిందితుడు. ఈ దాడిలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. నిందితుడిని ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

జావా ద్వీపంలోని పండేగ్లాంగ్​ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. హుటాహుటిన దగ్గరలోని బెరక్కా ఆసుపత్రికి విరంటోను తీసుకెళ్లారు. రెండు చోట్ల బలమైన గాయాలయ్యాయని, శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అనంతరం ఆయనను అక్కడి నుంచి రాజధాని జకర్తాకు తరలించారు.

అక్కడే గొడవ పడుతూ..

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అక్కడే గొడవ పడుతున్న ఇద్దరిని నిందితులుగా అనుమానిస్తున్నారు. వీరిని సియారిల్​ అలామ్​సీ(31), ఫితురి ఆండ్రియానా (21)గా గుర్తించారు. వీరిద్దరూ ఇస్లామిక్​ స్టేట్ తీవ్రవాదానికి ప్రభావితమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గందరగోళం సృష్టించేందుకే...

ప్రపంచంలో ముస్లిం ఆధిక్యం కలిగిన అతిపెద్ద దేశం ఇండోనేసియాకు అధ్యక్షుడిగా జోకో విడోడో ఇటీవలే ఎన్నికయ్యారు. ఆ సమయంలో జరిగిన అల్లర్లలోనూ విరంటోను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఆ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దేశంలో రాజకీయ నేతల హత్యల ద్వారా గందరగోళం సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నారని తెలిపారు.

మానవ హక్కుల ఉల్లంఘన!

1999లో తూర్పు తైమూర్​లో ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని విరంటోపై ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లపాటు ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు.

ఇదీ చూడండి: కాల్పులు జరిపాడు- దృశ్యాలను పోస్ట్​ చేశాడు

ABOUT THE AUTHOR

...view details