దక్షిణ అఫ్గానిస్థాన్‌లో సైనిక అధికారులే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి కారుబాంబు దాడిలో నలుగురు పౌరులు సహా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. నహ్రీసరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి, మరో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
చెక్‌పాయింట్ లక్ష్యంగా జరిగిన ఈ దాడికి.. ఎవరూ తక్షణ బాధ్యత వహించలేదు. అయితే.. ఆ ప్రాంతంలోని తాలిబన్లే ఈ ఘటనకు కారణమై ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.