భూమి.. మానవుడికి ఆవాసమే కాదు ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. మనుషులతో పాటు పలు జీవరాసులు ఈ ధరణిపై కలిసి నివసిస్తున్నాయి. అలాంటి ఈ పుడమిపై అగ్నిపర్వతాలూ ఓ భాగమే. ఇవి వేడి వేడి పొగలు కక్కుతూ.. ఎర్రటి లావాను వెదజల్లుతూ ఉంటాయి. అయితే వీటిల్లోనూ చాలా రకాలుంటాయి. లావాతో పాటు కొన్ని పొగ, బూడిదను విడుదల చేస్తుంటాయి.
ఇండోనేషియాలోని కావా ఐజెన్ అగ్నిపర్వతం మరింత భిన్నం. ఎందుకంటే దీని నుంచి వచ్చే అగ్నిజ్వాలలు నీలం రంగులో కనిపిస్తాయి. అందుకే ఎంతోమంది వీక్షకుల మదిని దోచింది కావా ఐజెన్. ఈ అగ్నిపర్వతం రంగుకు కారణం సల్ఫ్యూరిక్ వాయివులని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఎంతో సుందరంగా ఉండే ఇది.. 600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మరుగుతూ ఉంటుందట. అప్పుడప్పుడూ గాలి తోడై 16 అడుగుల ఎత్తైన మంటలు వెదజల్లుతుందట.