తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణ ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్​లో భూకంపం సంభవించింది. భూకంపం.. సముద్రానికి 95కిలోమీటర్ల లోతులో 7.0 తీవ్రతతో ఏర్పడడం వల్ల సునామీ హెచ్చిరిక జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

By

Published : Jan 21, 2021, 8:37 PM IST

Strong earthquake shakes southern Philippines
ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం

దక్షిణ ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​స్కేల్​పై 7.0తో భూకంపం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు.

దావో రాష్ట్రంలోని పొండగుయిటన్​కి ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో 95.8కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడ్డట్లు తెలిపారు అధికారులు. అయితే సునామీ హెచ్చరిక జారీ చేసేంత స్థాయిలో భూకంపం రాలేదని అమెరికాకు చెందిన భౌగోళిక సర్వే పేర్కొంది.

పక్కనున్న నగరాలు భూకంపం ధాటికి ప్రభావితమైనట్లు ఫిలిప్పీన్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వాల్కెనోలాజీ, సిస్మోలాజీ వెల్లడించింది.

ఇదీ చూడండి: ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం- ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details