ఇండోనేషియాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. దీని తీవ్రత దృష్ట్యా సునామీ వచ్చే ప్రమాదం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఉత్తర సులవేసి, ఉత్తర మలుకు మధ్య ఉన్న మొలుక్కా సముద్రంలో... 24 కి.మీ లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది.