ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బక్క చిక్కినట్లు వచ్చిన వార్తలతో ఆ దేశ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ అధినేత సన్నబడడంతో ఆయన ఆరోగ్యానికి ఏమైందోనన్న బెంగతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మీడియా పేర్కొంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బక్క చిక్కడాన్ని.. ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ దేశాధినేత ఆరోగ్యానికి ఏమైనా అయిందేమో అన్న ఆందోళనతో తెగ బాధపడిపోతున్నారు. ఈ విషయాన్ని అక్కడి అధికారిక మీడియా ధ్రువీకరించింది. తమ అధినేత సన్నబడినట్లు ఉన్న వీడియోను చూసి తమ హృదయాలు ఎంతగానో కలత చెందాయని దేశంలో చాలామంది చెప్పారని ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీటీవీ పేర్కొంది. దేశంలో ప్రతిఒక్కరూ ఇదే విషయంపై చర్చించుకుంటున్నారని కిమ్‌ను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపింది
బాహ్య ప్రపంచానికి చాలా అరుదుగా కనిపించే కిమ్ ఈ మధ్యే జరిగిన పార్టీ ప్లీనరీలో అధికారులతో సమావేశమయ్యారు. ప్లీనరీ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన ఓ సంగీత కార్యక్రమంలోనూ కిమ్ పాల్గొన్నారు. వాటికి సంబంధించిన వీడియోల్లో సన్నబడిన కిమ్‌ను చూసి దేశ ప్రజలు షాక్‌కు గురైనట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. ఐదు నెలల క్రితం బొద్దుగా ఉన్న కిమ్, ఒక్కసారిగా బరువు తగ్గడంతో ఆయన ఆరోగ్యంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అభిప్రాయపడింది. కిమ్ భారీగా బరువు తగ్గారనే వార్త అంతర్జాతీయంగానూ ఆసక్తిగా మారింది. కొన్ని నెలల్లోనే ఒక్కసారిగా బరువు తగ్గడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు అనారోగ్యం కారణమా? లేక కావాలనే బరువు తగ్గారా అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వని ఉత్తర కొరియా అధికారులు.. కిమ్ బరువు తగ్గారనే మాట వాస్తవమేనని ధ్రువీకరించారు
ఇవీ చదవండి:వెంటపడిన జింక- నగ్నంగా పరుగో పరుగు!
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్ ప్రారంభం