ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్ఏటీఎఫ్) గ్రే జాబితాలో ఉన్న పొరుగుదేశం శ్రీలంకకు ఊరట లభించింది. తమను ఈ జాబితా నుంచి తొలగించినట్లు ఓ అధికారిక ప్రకటన విడుదుల చేసింది.
శ్రీలంకకు ఊరట.. ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి తొలగింపు - ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ గ్రే లిస్ట్
ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ గ్రే లిస్ట్ నుంచి తమ దేశాన్ని తొలగించినట్లు శ్రీలంక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద కార్యకలపాలకు నిధులు చేరవేస్తుందన్న ఆరోపణలతో లంకను ఇప్పటి వరకు గ్రే జాబితాలో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్.
![శ్రీలంకకు ఊరట.. ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి తొలగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4807963-thumbnail-3x2-fatf.jpg)
ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి శ్రీలంక తొలగింపు
పారిస్‌లో అయిదు రోజుల పాటు జరిగిన ఎఫ్ఏటీఎఫ్ భేటీలో..ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా తీసుకున్న చర్యలపై శ్రీలంకను ప్రశంసించింది. అంతర్జాతీయ మనీలాండరింగ్ వ్యతిరేక చర్యలు సహా ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా తీసుకునే చర్యల్లో శ్రీలంక మంచి పురోగతి సాధించిందని తెలిపింది. పలు మార్గదర్శకాల్లో సరైన పనితీరు కనబర్చనందుకు 2017లో శ్రీలంకను గ్రే జాబితాలో చేర్చింది ఎఫ్ఏటీఎఫ్.
ఇదీ చూడండి:'ఈటీవీ భారత్'పై మిస్ ఇండియా ప్రశంసల జల్లు
Last Updated : Oct 20, 2019, 7:56 AM IST