తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక చెర నుంచి 54 మంది భారత జాలర్ల విడుదల - భారత

శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి అరెస్టైన 54మంది భారత జాలర్లను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.

Indian fishermen
భారత జాలర్లు

By

Published : Mar 27, 2021, 1:45 PM IST

54 మంది భారత జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసిందని భారత అధికరులు తెలిపారు. శుక్రవారం నాడు 40మందిని, శనివారం 14 మందిని విడుదల చేశారని వెల్లడించారు.

మార్చి 24న శ్రీలంక సముద్ర జలాల్లోకి 54 మంది భారత జాలర్లు ప్రవేశించగా.. వారిని నౌకాదళం అధికారులు అరెస్టు చేశారు. మానవతా దృక్పథంతో వారిని విడుదల చేయాలని భారత హైకమిషనర్​.. శ్రీలంక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందుకు పొరుగు దేశం సానుకూలంగా స్పందించింది.

ఇదీ చదవండి:తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుంది: మోదీ

సముద్రజలాల ప్రాదేశిక సరిహద్దు అతిక్రమణల గురించి చర్చించడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​.. జనవరిలో శ్రీలంకకు వెళ్లారు. తరువాత ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీలంక ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి:'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం'

ABOUT THE AUTHOR

...view details