రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వీ 91.4 శాతం సామర్థ్యాన్ని చూపిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మాస్కోలోని గమలేయ జాతీయ అంటువ్యాధులు, మైక్రోబయాలజీ కేంద్రం.. క్లినికల్ ట్రయల్స్ రెండో మధ్యంతర విశ్లేషణ ఫలితాలను విడుదల చేసింది.
ప్రయోగించిన 28 రోజులకు స్పుత్నిక్ టీకా 91.4 శాతం ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని రష్యా వెల్లడించింది. 42 రోజుల తర్వాత 95 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది.
ధర తక్కువే..
అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర చాలా తక్కువ ధరకే లభిస్తుందని రష్యా వెల్లడించింది. ఒక్కో డోసు ధర 10 అమెరికన్ డాలర్లు (రూ.700)గా నిర్ణయించినట్లు తెలిపింది. ఇతర ఎన్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే ఇది రెండు, మూడు రెట్లు చౌకగా దొరుకుతుందని.. రష్యన్ పౌరులకు మాత్రం ఉచితంగా అందిస్తామని స్పష్టం చేసింది
అంతర్జాతీయ సంస్థలతో కలిసి టీకాను తయారు చేస్తున్నామని.. 2021 సంవత్సరంలో 50 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది.
ఇదీ చూడండి:ఆశాకిరణంగా ఆక్స్ఫర్డ్ టీకా- 70 శాతం సమర్థత