తాలిబన్ల పాలనలోని అప్లానిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్‌లో పర్యటించారు. అఫ్గాన్ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్ హసన్ అఖుంద్, విదేశాంగ మంత్రి ఆమీర్‌ఖాన్ ముత్తకీతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర తాలిబన్ ఉన్నతాధికారులతో (afghanistan taliban) వారు భేటీ అయ్యారు. ప్రభుత్వంలో ఇతర వర్గాలను భాగస్వాములుగా చేసుకోవడం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ బుధవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, మానవ హక్కుల పరిరక్షణ, ఆర్థిక పరిస్థితులపై వారు చర్చలు జరిపినట్లు లిజియాన్ తెలిపారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్టాయ్, గత ప్రభుత్వంలోని మరో కీలక నేత అబ్బుల్లా అబ్బుల్లాలతోనూ మూడు దేశాల ప్రత్యేక రాయబారులు భేటీ అయ్యారని వెల్లడించారు.
'ఐరాసలో అవకాశమివ్వండి'
అప్లానిస్థాన్‌లోని తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపును సాధించుకునే దిశగా తాలిబన్లు (afghanistan news) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఐక్యరాజ్యసమితిలో తమ దేశ నూతన రాయబారిగా సుహైల్ షహీన్‌ను నామినేట్ చేస్తూ ఆ సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్‌కు అష్లాన్ సర్కారు తాజాగా లేఖ రాసింది. న్యూయార్క్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడేందుకు తమకు అవకాశమివ్వాలని కూడా అందులో కోరింది.
జలాలాబాద్‌లో తాలిబన్లపై మళ్లీ దాడులు
అఫ్గానిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు.. ముష్కరుల ధాటికి బెంబేలెత్తుతున్నారు. తూర్పు అఫ్గాన్‌లోని జలాలాబాద్ నగరంలో (jalalabad afghanistan news) వారిపై దాడులు కొనసాగుతున్నాయి. జలాలాబాద్‌లో బుధవారం ఒక్కరోజే.. తాలిబన్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని మూడు చోట్ల దాడులు జరిగాయి. వీటిలో కనీసం ఇద్దరు ముఠా సభ్యులు సహా మొత్తం ఐదుగురు మృత్యువాతపడ్డారు. తొలుత తాలిబన్ల వాహనంపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముఠా సభ్యులు హతమయ్యారు. అదే ఘటనలో ఓ చిన్నారి, గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో.. తాలిబన్ వాహనంపై బాంబు దాడి చోటుచేసుకోగ్లా ఓ చిన్నారి దుర్మరణం ప్రాలైనట్లు స్థానికులు తెలిపారు. తాజా దాడులకు పాల్పడింది ఎవరన్నదీ ఇంకా తెలియరాలేదు. గత వారం కూడా జలాలాబాద్‌లో తాలిబన్లను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులు చోటు చేసుకున్నాయి. వాటిలో కనీసం 8 మంది మృత్యువాతపడ్డారు. గతవారం దాడులకు తెగబడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. తాలిబన్, ఐఎస్ ముఠాల మధ్య దీర్ఘకాలంగా శత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే.
తాలిబన్లను బాయ్‌కాట్ చేయొద్దు: కతర్
తాలిబన్లను బాయ్‌కాట్ చేయొద్దని, వారి నేతృత్వంలోని అష్లానిస్థాన్ సర్కారుకు అధికారిక గుర్తింపునివ్వాలని ప్రపంచ నేతలను కతర్ (taliban qatar) కోరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం ప్రసంగించారు. తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం సంప్రదింపులు కొనసాగించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. వారిని బాయ్‌కాట్ చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తే ముప్పుందని పేర్కొన్నారు. వారితో చర్చలు జరపడం వల్ల సానుకూల ఫలితాలను రాబట్టొచ్చని సూచించారు.
ఇదీ చూడండి :'రైతుల దృఢ సంకల్పానికి సాక్ష్యం ఈ ఉద్యమం'