దక్షిణ కొరియాలో రోజువారీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగోరోజూ అక్కడ కొత్తగా వైరస్‌బారిన పడినవారి సంఖ్య 500 దాటింది. మరోవైపు టీకా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ కొరియాలో శనివారం కొత్తగా 543 మందికి వైరస్ సోకిందని ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. ఈ కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1,04,736కు చేరిందని చెప్పింది. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,740కు పెరిగినట్లు వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో 320 కేసులు.. ఒక్క సియోల్ నగరంలోనే వెలుగు చూశాయి. మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంటివద్దే పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా ర్యాపిడ్ టెస్టులను అనుమతించాలని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది.
బంగ్లాదేశ్‌లో వారంపాటు..
బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. శుక్రవారం అక్కడ 6,800పైగా మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ విజృంభణ వల్ల ఇటీవల అక్కడి ప్రభుత్వం పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. తాజాగా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. ఏప్రిల్ 5వ తేదీ సోమవారం నుంచి ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఫ్రాన్స్‌లో మూడోసారి..