దక్షిణ కొరియాలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 583 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 3,736కు చేరింది. కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు తెలిపారు. ఇతర దేశాల్లో పరిస్థితి గురించి డబ్ల్యూహెచ్ఓ అందించిన నివేదికలను ఓ సారి చూద్దాం.
కరోనా: దక్షిణ కొరియాలో అలా.. ప్రపంచ వ్యాప్తంగా ఇలా
By
Published : Mar 1, 2020, 3:19 PM IST
|
Updated : Mar 3, 2020, 1:44 AM IST
గతేడాది చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణ కొరియాలో వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 586 కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 3,736కు చేరింది. ఈ పరిస్థితులపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్పందించారు. కరోనాను అరికట్టేందుకు తమ ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తోందని తెలిపారు. మరోవైపు వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80 వేలమందికి పైగా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన నివేదికలను ఓ సారి చూాద్దాం.
వివరాలిలా..
చైనాలో ఇప్పటివరకు 2,870 మంది మరణించగా... సుమారు 79,824 కేసులు నమోదయ్యాయి.