దక్షిణ కొరియాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 397 కేసులు వెలుగుచూసినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. వరుసగా 10 రోజుల నుంచి మూడంకెల సంఖ్య నమోదవుతున్నట్లు తెలిపారు. ఆ దేశ రాజధానితో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ఎక్కువ కేసులు బయటపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
కొరియా, చైనాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా - china corona cases
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన దేశాల్లో మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణ కొరియాలో మరో 397 మందికి వైరస్ సోకింది. వరుసగా 10 రోజుల నుంచి మూడంకెల సంఖ్య నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే చైనాలో ఇవాళ 12, పాకిస్థాన్లో 591 మంది మహమ్మారి బారినపడ్డారు.
దక్షిణ కొరియా, చైనా దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా
కేసులు పెరగడానికి భౌతిక దూరం పాటించకపోవటమే కారణమని భావించిన అధికారులు ప్రార్థనా మందిరాలు, బీచ్లు, క్రీడా ప్రాంగణాలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ఇతర ప్రదేశాలపై ఆంక్షలు విధించారు.
- చైనాలో ఇవాళ 12 మందికి వైరస్ సోకింది. వీటితో పాటు విదేశాల నుంచి వచ్చినవారిలో లక్షణాలు లేని మరో 15 కేసులును గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84,951 కేసులు నమోదయ్యాయి. దాదాపు 80 వేల మంది కోలుకోగా.. ప్రస్తుతం 400 యాక్టివ్ కేసులున్నాయి.
- పాకిస్థాన్లో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 591 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. మొత్తం 6,235 మంది మరణించగా.. మొత్తం కేసుల సంఖ్య 2,75,836గా ఉందని అధికారులు తెలిపారు.