కరోనా వైరస్ ధాటికి చైనా సహా ప్రపంచ దేశాలూ అల్లాడిపోతున్నాయి. దక్షిణ కొరియాలో ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే ఇద్దరు మరణించగా.. తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కొరియాలో మృతుల సంఖ్య 4కు పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 123 కేసులు నమోదైనందున.. ఇప్పటివరకు మొత్తం 556 కేసులతో చైనా తర్వాత ఎక్కువ కేసులు గుర్తించిన రెండో దేశంగా నిలిచింది దక్షిణ కొరియా.
కరోనా కాటుకు కొరియాలో మరో ఇద్దరు బలి
కరోనా వైరస్‌తో దక్షిణ కొరియా బెంబేలెత్తుతోంది. ఈ మహమ్మారి కారణంగా కొరియాలో ఇప్పటికే ఇద్దరు మరణించగా తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ఇవాళ ఒక్కరోజే 123 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా కాటుకు కొరియాలో మరో ఇద్దరు బలి
కొత్తగా నమోదైన కేసుల్లో 75మంది డేగులోని షిన్చియోంజి చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న కరోనా వైరస్ బారిన పడ్డ ఓ మహిళ.. అంతకు ముందు నగరంలోని నాలుగు చర్చిలకు హాజరైనట్లు అధికారులు భావిస్తున్నారు .
సుమారు 2.5 మిలియన్ల జనాభా కలిగిన డేగులో ఆదివారం 90కి పైగా కొత్త కేసులను గుర్తించారు. వైరస్ లక్షణాలున్నట్లు ఎవరికైనా అనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నగర మేయర్ సూచించారు.
Last Updated : Mar 2, 2020, 6:47 AM IST