యాంటీ-పైరసీ(సముద్ర దోపిడీల నివారణ) మిషన్పై పనిచేస్తున్న ఓ డిస్ట్రాయర్ నౌకలో ఉన్న సిబ్బంది కరోనా బారిన పడటంపై దక్షిణ కొరియా ప్రధానమంత్రి కిమ్ బూ-క్యూమ్ విచారం వ్యక్తం చేశారు. సైనికుల ఆరోగ్యాన్ని కాపాడటంలో విఫలమైనందుకు క్షమించాలని ప్రజలను కోరారు.
దక్షిణ కొరియా మిలిటరీకి చెందిన మున్ము అనే విధ్వంసక నౌక.. తూర్పు ఆఫ్రికాలో కార్యకలాపాలు సాగిస్తోంది. అందులో ఉన్న 301 మంది సిబ్బందిలో 247 మంది కరోనా బారిన పడ్డారు. నౌకలోని వారినందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు.. రెండు మిలిటరీ విమానాలను పంపించారు.