ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నాటికి దాదాపు 78 లక్షల మంది బారిన పడ్డారు. మొత్తం మరణాలు సంఖ్య 4లక్షల 30 వేలకు చేరువైంది.
అమెరికాలో మరో 5,477 కేసులు
అమెరికాలో తాజాగా 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితులు సంఖ్య 21 లక్షల 22 వేలకు చేరువైంది. మరో 109 మంది మృతి చెందగా... ఫలితంగా దాదాపు లక్షా 17 వేలకు మంది వైరస్‌కు బలయ్యారు.
రష్యాలో 8 వేల కేసులు
రష్యాలో కరోనా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,706 మంది వైరస్ సోకింది. ఫలితంగా వైరస్ బాధితుల సంఖ్య 5,20,129కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6 వేల 829 మంది మహమ్మారికి బలయ్యారు.
అత్యధిక కేసులు
పాకిస్థాన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 6,472 మందికి వైరస్ సోకింది. ఒకరోజు ఇన్ని కేసులు నమోదవ్వటం ఇదే తొలిసారి. మరో 88 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,551కి చేరింది. దేశ వ్యాప్తంగా లక్షా 32 వేల 405 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 50,056 మంది కోలుకున్నారు.
నేపాల్‌లో 273 కేసులు..
నేపాల్లోనూ వైరస్ విజృభిస్తోంది. గడిచిన 24గంటల్లో 273 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,335కు ఎగబాకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 18కి చేరింది.
దక్షిణ ఆఫ్రికాలో...
దక్షిణ ఆఫ్రికా కరోనా తీవ్రరూపం దాల్చుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో 3,359 కేసులు నమోదైనట్లు ఆ దేశ అధికారుల వెల్లడించారు. వీటితో కలిపి మొత్తం కేసులు సంఖ్య 61 వేలు దాటినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 1,354 మంది వైరస్‌కు బలయ్యారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు.
సింగపూర్‌లో 347 కేసులు..
సింగపూర్‌లోనూ వైరస్ విజృభిస్తోంది. గడిచిన 24గంటల్లో 347 మందికి కరోనా సోకింది. వీరిలో 345 మంది విదేశీ కార్మికులని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 25కు చేరింది.
మెక్సికోలో 5,222 కేసులు
మెక్సికోలో తాజాగా 5,222 కేసులు నమోదైనట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. మరో 504 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 16,448కి ఎగబాకింది. దేశ వ్యాప్తంగా 1,39,196 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో లక్ష మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ను సడలించే దిశగా అడుగులు వేస్తుంది ఆ దేశ ప్రభుత్వం. వచ్చే వారం నుంచి అన్ని వ్యాపారకార్యకలాపాలన్ని పునః ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియాలో 49 కేసులు
దక్షిణ కొరియా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 44 సియోల్ నగరంలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 12,051కి చేరింది. ఇప్పటి వరకు 277 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చూడండి:దేశంలో కరోనా తీవ్రతపై ప్రధాని మోదీ సమీక్ష