కొవిడ్-19, సీజనల్ ఫ్లూ వైరస్ను ఒకే టెస్టుతో గుర్తించేందుకు దక్షిణ కొరియా కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. సీజనల్ వ్యాధులు, కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఈ నూతన విధానం తీసుకొచ్చామని పేర్కొంది ఆ దేశ ఆరోగ్య శాఖ.
కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. కానీ, శీతాకాలంలో కొవిడ్ ఉద్ధృతి మరింత పెరగనుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికాభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయడం వల్ల ప్రజలు బయట తిరగడం సాధరణమైంది. ఫలితంగా దేశంలో మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
" ఆరోగ్య శాఖ అధికారులు... కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా ప్రయత్నించారు. కానీ, వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చింది".
-యూన్ టేహో, సీనియర్ ఆరోగ్య నిపుణులు.
ఒకే టెస్టులో ఎలా?