తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇలా అయితే మేం పాకిస్థాన్​‌ నుంచి వెళ్లిపోతాం!'

సామాజిక మాధ్యమాలపై పాక్​ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును 'ఆసియా ఇంటర్నెట్‌ కోలేషన్'(ఏఐసీ) తప్పుపట్టింది. ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనల వల్ల పాక్‌లో సేవల్ని కొనసాగించడం కష్టతరమవుతుందని స్పష్టం చేసింది. 15రోజుల్లోగా నిబంధనల్ని సమీక్షించకపోతే సేవల్ని నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

By

Published : Nov 21, 2020, 3:51 PM IST

social media companies warn pakistan govt over new rules
'ఇలా అయితే మేం పాక్‌ నుంచి వెళ్లిపోతాం!'

సామాజిక మాధ్యమాల నియంత్రణకు పాకిస్థాన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం 'ఆసియా ఇంటర్నెట్‌ కోలేషన్'(ఏఐసీ)కు ఆగ్రహం తెప్పించింది. ఏఐసీలో ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విటర్‌ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనల వల్ల పాక్‌లో సేవల్ని కొనసాగించడం కష్టతరమవుతుందని స్పష్టం చేసింది. వెంటనే నిబంధనల్ని సమీక్షించని పక్షంలో సేవల్ని నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త చట్టంలోని నియమాలను ఉటంకిస్తూ ఏఐసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ రూపొందించిన నిబంధనలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని స్పష్టం చేసింది.

పాక్‌ కొత్త నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాలు లేదా అంతర్జాల సేవలు అందించే సంస్థలపై నియంత్రణ కోసం సంబంధిత అధికార యంత్రాంగానికి అనేక అధికారాలను కట్టబెట్టింది. మత, ఉగ్రవాద, అశ్లీల, విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారాన్ని నిలువరించడంలో సామాజిక సంస్థలు నిబంధనల్ని ఉల్లఘించినట్లు తేలితే 3.14 మిలియన్ల డాలర్లు జరిమానా విధించేందుకు ఇమ్రాన్‌ సర్కార్‌ అనుమతించింది. అలాగే పాక్‌ ప్రభుత్వం కోరితే ఏ సమాచారన్ని అయినా సోషల్‌ మీడియా సంస్థలు సవివరంగా అందజేయాల్సి ఉంటుంది. పాక్‌ అభ్యంతరం చెప్పిన సమాచారాన్ని 24 గంటల్లోగా మాధ్యమాల నుంచి తొలగించాలి. ఆయా సంస్థలు ఇస్లామాబాద్‌లో కార్యాలయాలను ప్రారంభించి డేటాను ఇక్కడి సర్వర్లలోనే స్టోర్‌ చేయాలని షరతు విధించింది. ఇవన్నీ పౌరుల వాక్‌ స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉన్నాయని ఏఐసీ పేర్కొంది.

మరోవైపు పాక్‌ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. సామాజిక మాధ్యమాల నుంచి అనుచిత సమాచారాన్ని తీసివేయాలని గతంలోనే ఆదేశించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే తాజా నిబంధనల్ని తీసుకురావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details