ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆచూకీపై నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది దక్షిణ కొరియా. గతంలోలా మళ్లీ 3 వారాలుగా కనిపించకపోవటంపై దృష్టి పెట్టినట్లు ప్రకటించింది. ఆయనకు సంబంధించిన వార్తలు, ఇతర అంశాలను గమనిస్తున్నామని తెలిపింది.
కొద్దిరోజుల క్రితం కిమ్ జోంగ్ ఉన్‌కు శస్త్రచికిత్స జరిగిన తర్వాత కనిపించకుండా పోయారు. ఎలాంటి ప్రభుత్వ, పరిపాలనాపరమైన కార్యక్రమాలకు హాజరుకాలేదు. దాంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అపస్మారక స్థితికి వెళ్లారని, చనిపోయారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. తనపై వస్తున్న వదంతులకు తెరదించుతూ మే 1న సున్చాన్లో ఓ ఎరువుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు కిమ్. ఆ కార్యక్రమం తర్వాత మళ్లీ కిమ్ కనిపించటంలేదు.
" సంబంధిత అధికారులు ఈ అంశంపై నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో జనవరిలోనూ ఆయన 21 రోజల పాటు కనిపించకుండాపోయారు. మీడియా నివేదికల ద్వారా ఆయన అదృశ్యంపై పరిస్థితులను గమనిస్తున్నాం."