తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా 'కరోనా వ్యాక్సిన్​' ఎంత సురక్షితం? - రష్యా వ్యాక్సిన్​

తాము అభివృద్ధి చేసిన కరోనా వైరస్​ వ్యాక్సిన్​ను రిజిస్టర్​ చేసినట్టు ప్రకటించింది రష్యా. ఇది ఇక ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు ఆ దేశాధ్యక్షుడు పుతిన్​. అయితే రష్యా వ్యాక్సిన్​పై ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మూడో దశ ట్రయల్స్​ పూర్తికాకుండానే.. వ్యాక్సిన్​ను విడుదల చేస్తే మొదటికే మోసం వస్తుందని రష్యా శాస్త్రవేత్తలే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

skepticism raised over Russia's corona virus vaccine
రష్యా 'వ్యాక్సిన్​' ఎంత సురక్షితం?

By

Published : Aug 11, 2020, 4:28 PM IST

Updated : Aug 11, 2020, 10:36 PM IST

కరోనా వైరస్​ టీకాను ప్రజలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రష్యా. నిజానికి ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ఇదో సంచలన వార్త. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇన్ని రోజులు వ్యాక్సిన్​ కోసం ఎదురుచూసిన ప్రపంచ దేశాలు రష్యా ప్రకటనపై సంబరపడకుండా.. వైరస్​ సురక్షితమేనా? కాదా? అని ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు కారణమేంటి?

మూడో దశ ముగియకుండానే...

ఆగస్టులో వ్యాక్సిన్​ను విడుదల చేస్తామని గత నెల నుంచే రష్యా స్పష్టంగా చెబుతోంది. దాన్ని నిజం చేస్తూ.. తాము అభివృద్ధి చేసిన టీకాను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కానీ రష్యా వ్యాక్సిన్​పై సొంత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడో దశ ట్రయల్స్​ నిర్వహించకుండానే వ్యాక్సిన్​ను ఎలా విడుదల చేస్తారని రష్యాకు చెందిన శాస్త్రవేత్తలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడో దశ పూర్తవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని.. వేల సంఖ్యలో ప్రజలపై పరీక్షలు నిర్వహించాలని చెబుతున్నారు. అలాంటిది.. ట్రయల్స్​ పూర్తిగా జరగకుండానే వ్యాక్సిన్​ను విడుదల చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

వీటన్నిటితో పాటు రష్యా వ్యాక్సిన్​పై మరో విషయంలోనూ ప్రజల్లో భయాందోళన నెలకొంది. వ్యాక్సిన్​ను విడుదల చేస్తున్నట్టు పుతిన్​ ప్రకటించినప్పటికీ.. ట్రయల్స్​కు సంబంధించి జరిగిన పరీక్షల ఫలితాలపై ఎలాంటి వివరాలు లేవు. ఎంత మందిపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ జరిపారనేది ఇంకా తెలియదు.

'అంతా బాగానే ఉంది...'

కానీ రష్యా అధ్యక్షుడు ఈ ప్రశ్నలన్నింటినీ తోసిపుచ్చుతూ వ్యాక్సిన్ విడుదలపై ప్రకటన చేశారు. ప్రజలకు టీకా వేసే ముందు చేయాల్సిన పరీక్షలన్నీ ఈ వ్యాక్సిన్​పై జరిపినట్టు స్పష్టంచేశారు. తన సొంత కుమార్తె.. ఈ వ్యాక్సిన్​ తీసుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు.

"ఈ వ్యాక్సిన్​ అన్ని పరీక్షలను పూర్తి చేసుకుంది. వ్యాక్సిన్​ ఎంత సురక్షితమైనదనే విషయమే అత్యంత కీలకం. దాని సమర్థత కూడా ముఖ్యమే. నా ఇద్దరు కుమార్తెల్లో ఒకరు ఈ వ్యాక్సిన్​ తీసుకున్నారు. రెండు డోసులు ఇచ్చారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. మొదటి డోసు ఇచ్చినప్పుడు 38 డిగ్రీలుగా ఉన్న శరీర ఉష్ణోగ్రత 37కు తగ్గింది. రెండో డోసు సమయంలో ఉష్ణోగ్రత కొంత పెరిగి జ్వరం వచ్చింది. ఆ తర్వాత అంతా మాములుగా మారిపోయింది."

--- వ్లాదిమిర్​ పుతిన్​, రష్యా అధ్యక్షుడు.

అయితే వ్యాక్సిన్​ తీసుకున్న కమార్తె పేరును మాత్రం పుతిన్​ బయటపెట్టలేదు.

భారీ స్థాయిలో ఉత్పత్తి

అక్టోబర్​ నాటికి వ్యాక్సిన్​ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది రష్యా. పలు దేశాలు ఇప్పటికే ఈ వ్యాక్సిన్​పై ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రధానమంత్రి మిఖైల్​ మురాస్కో వెల్లడించారు.

రష్యా వ్యాక్సిన్​ను గమలేయా రీసర్చ్​ ఇన్​స్టిట్యూట్​, దేశ రక్షణశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ టీకాకు సంబంధించి క్లినికల్​ ట్రయల్స్​ జూన్​ 18న ప్రారంభమయ్యాయి. ఇందులో 38 మంది వలంటీర్లు పాల్గొన్నారు. అందరిలోనూ రోగనిరోధక శక్తి పెరిగింది. వీరు జులై 15, 20వ తేదీల్లో డిశ్చార్జ్​ అయ్యారు.

రష్యా వ్యాక్సిన్​ ఇలా...

ఇదీ చూడండి:-కరోనా వ్యాక్సిన్​ తొలుత అందేదెవ్వరికి?

Last Updated : Aug 11, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details