వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షల్లో తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా మెరుగైన ఫలితాలను అందిస్తోందని చైనాకు చెందిన సినోఫార్మ్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు తమ వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి కావాలని చైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
"వివిధ దేశాల్లో జరిపిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని సేకరించి, నివేదిక రూపంలో చైనా ప్రభుత్వానికి అందించాం. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వమే."
---- సినోఫార్మ్ సంస్థ.