సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ఘన విజయం సాధించింది. దేశంలోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని లీ షియాన్ లూంగ్ పార్టీ 83 సీట్లు గెలుచుకుంది. ప్రధాని లూంగ్ కూడా తన గ్రూప్ రిప్రెజెంటేషన్ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొందారు.
భారత సంతతికి చెందిన ప్రీతమ్ సింగ్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ మిగిలిన పది స్థానాల్లో గెలుపొందింది. ఈ స్థానాల్లోనూ పీఏపీ గట్టి పోటీనిచ్చినా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.
మాస్కులు, గ్లౌజులతో..
పటిష్ఠ భద్రత నడుమ శుక్రవారం సింగపూర్ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. కరోనా సంక్షోభం మొదలైన తరువాత ఓ ఆగ్నేయాసియా దేశంలో జాతీయ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో ఓటర్లు మాస్కులు, చేతి తొడుగులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ... ఓటింగ్‌లో పాల్గొన్నారు. కరోనా రోగులకు, క్వారంటైన్లో ఉన్నవారికి మాత్రం ఓటింగ్‌కు అనుమతించలేదు.
ఈసారీ.. 'లీ'దే అధికారం