ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించింది సింగపూర్. ఫలితంగా ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాను ఉపయోగించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. త్వరలోనే మరిన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో విస్తృతంగా టీకా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో 70ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది ఆరోగ్య నిపుణుల కమిటీ. ఆ తర్వాత వైద్య సిబ్బంది, కరోనా యోధులు సహా.. వైరస్ నుంచి ముప్పు ఎక్కువగా ఉన్నవారికి టీకా అందించాలని సిఫార్సు చేసింది.
ఈ వ్యాక్సిన్ కరోనాను వెంటనే నివారించలేనప్పటికీ.. దేశాన్ని సురక్షిత స్థాయిలో ఉంచేందుకు దోహదపడుతుందని ఆరోగ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
సింగపూర్‌లో ఇప్పటివరకు 58వేల 542 మందికి వైరస్ సోకింది. 29 మంది కొవిడ్‌కు బలయ్యారు. 58వేల 400 మంది మహమ్మారిని జయించగా.. ప్రస్తుతం 113 యాక్టివ్ కేసులున్నాయి.