నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు శ్వాస ద్వారా కొవిడ్-19ను నిర్ధరించే వినూత్న సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా నిమిషం వ్యవధిలోనే ఫలితాన్ని అందించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో పరీక్షలను వేగంగా నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇందులో ఒకసారి వాడి పారేసే మౌత్‌పీస్ భాగం ఉంటుందన్న పరిశోధకులు దీనికి అత్యంత కచ్చితత్వంతో కూడిన శ్వాస శాంప్లర్ అనుసంధానమై ఉంటుందని తెలిపారు.