BA.2 Variant Omicron: విస్తృతంగా వ్యాప్తిచెందుతూ ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. ఈ వేరియంట్ నుంచి సబ్వేరియంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. భారత్ సహా ఇప్పటికే పలు దేశాల్లో బీఏ.2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. తాజాగా సింగపూర్‌లో కూడా ప్రమాదకర బీఏ.2 వేరియంట్ వెలుగు చూసింది.
ఈనెల 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 198 కేసులు నమోదుకాగా.. వీటిలో 150 విదేశీ ప్రయాణికులలో గుర్తించినవని అధికారులు వెల్లడించారు. మిగిలిన 48 కేసులు స్థానికుల్లో నమోదైనట్లు తెలిపారు. అయితే ఈ సబ్‌వేరియంట్ కేసులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సబ్‌వేరియంట్.. ఒమిక్రాన్ బీఏ.1 కన్నా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
సింగపూర్‌లో శుక్రవారం కొత్తగా 5,554 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 3,38,625 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 853కు చేరింది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాల్లో ఈ బీఏ.2 సబ్‌వేరియంట్‌ను గుర్తించారు శాస్త్రవేత్తలు.