ప్రపంచ దేశాలన్నీ కరోనాను ఎదుర్కొనేందుకు పోరాడుతున్న వేళ.. సింగపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆరునెలల గడువు ఉండగానే.. సాధారణ ఎన్నికలకు సన్నద్ధమయ్యారు ప్రధానమంత్రి లీ షియాన్ లూంగ్. టీవీ ప్రసంగం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన లీ.. నూతన ఎన్నికల నిర్వహణ కోసం పార్లమెంట్‌ను రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు రిట్ జారీ చేయాలని అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల నిర్వహణతో ప్రస్తుతం పాలనలో ఎదురవుతున్న అవాంతరాలు తొలగిపోతాయని.. నూతన ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు సింగపూర్ అభివృద్ధి అజెండాతో పనిచేసేందుకు వీలు కలుగుతుందని లీ షియాన్ పేర్కొన్నారు. లీ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీకి ప్రస్తుత పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీ ఉంది. అయితే అనూహ్యంగా పార్లమెంట్ రద్దుకు ప్రధాని సిఫార్సు చేసిన నేపథ్యంలో 2021 ఏప్రిల్‌లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
కరోనా నియంత్రణకు సమర్థ పోరు..